రైతులకు బాసటగా యావత్ భారతం.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మద్దతుగా ఈరోజు రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, పార్టీలు, కార్మిక కర్షక వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభించింది బంద్ విజయవంతంగా కొనసాగుతుంంది. గత కొన్ని సంవత్సరాలలో ఇలా ఒక బంద్ సంపూర్ణ మద్దతు లభించడం ఇదే మొదటిసారి. రైతులకు భారతదేశం బాసటగా నిలిచింది అనడానికి ఈ బంద్ ఒక ఉదాహరణ. కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూడా బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపడం విశేషం. గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది రైతులు తమ నిరసనను తెలుపుతున్న విషయం తెలిసిందే.