ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని (PJTSAU) బైపీసీ స్ట్రీమ్ (హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ)లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఈనెల 9వ తేదీ నుంచి సంయుక్తం గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు.
- BSc (హానర్స్) అగ్రికల్చర్ 432 సీట్లు,
- BSc (హానర్స్) హార్టికల్చర్ 130 సీట్లకు,
- B.V.Sc & AH 158 సీట్లకు,
- B.F.Sc 36 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వివరించారు.
అడ్మిషన్ పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి, నిర్ణీత ఫీజును వెంటనే చెల్లించాలని సూచించారు.
బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (హానర్స్)హార్టికల్చర్ పేమెంట్ కోటా సీట్ల కోసం విడిగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
● వెబ్సైట్ ::
● పూర్తి నోటిఫికేషన్ pdf ::
https://drive.google.com/file/d/1Lom_gYSlCA97V9vW8q77qlKEZrpFgBmd/view?usp=drivesdk