స్కూల్స్ నిర్వహణకు సిద్ధం – ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్

తెలంగాణ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో మూతబడిన పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, పాఠశాలలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖలో పేర్కొన్నారు.

లేఖలో కనీసం 9, 10వ తరగతి విద్యార్థులకైనా ఆప్ లైన్ తరగతులను ప్రారంభించాలని. అలాగే కరోనా నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలకు అవసరమయ్యే సానిటేషన్ మెటీరియల్, మాస్కులు, ఇతర సామగ్రి అందజేయాలని, సానిటేషన్ వర్కర్లను నియమించాలనివిజ్ఞప్తి చేశారు.