త్వరలో బదిలీల మార్గదర్శకాలు -సీజేఎల్స్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ బదిలీల సమస్యపై గత నెలలో సీఎం కేసీఆర్ స్పందించి బదిలీ మార్గదర్శకాలను విడుదల చేయవలసిందిగా విద్యాశాఖ అధికారులకు సూచించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన చేసి 20 రోజులు గడుస్తున్నా విద్యా శాఖ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ ల ఆధ్వర్యంలో సీజేఎల్స్ ఈ రోజు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్ కలిసి బదిలీల మార్గదర్శకాలను విడుదల చేసి బదిలీల ప్రక్రియ త్వరగా జరపవలసినదిగా కోరడం జరిగింది.

దీనిపై స్పందించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బదిలీ మార్గదర్శకాల పై కొన్ని అంశాలను విద్యా శాఖ మంత్రితో చర్చించడం జరిగిందని, బదిలీల విషయంలో విద్యా శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారని, వీలైనంత త్వరగా మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేశారు.