8,500 పోస్టులతో SBI భారీ నోటిఫికేషన్.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీ  ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించింది.

దేశంలోని వేర్వేరు జోన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల లో కూడా 1080 పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. వీరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించరు. ఎంపికైనవారికి మూడేళ్లు ట్రైనింగ్ ఉంటుంది.   ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 10 చివరి తేదీ. 2021 జనవరిలో పరీక్ష ఉంటుంది.

● మొత్తం ఖాళీలు ::8500

◆ తెలంగాణ :: 460 

(ఆదిలాబాద్ -10, భద్రాద్రి కొత్తగూడెం -21, జగిత్యాల -9, జనగాం -10, జయశంకర్ -12, జోగులంబా -9, కామారెడ్డి -16, కరీంనగర్ – 14, ఖమ్మం – 24, కొమరంభీమ్ -7, మహాబూబాబాద్ -12, మహబూబ్‌నగర్ -33, మల్కాజ్‌గిరి -5, మంచిర్యాల -8, మెదక్ -14, నాగర్‌కూర్నూల్ -15, నల్గొండ -22, నిర్మల్ -11, నిజామాబాద్ -39, పెద్దపల్లి -10, రంగారెడ్డి -22, సంగారెడ్డి -20, సిద్దిపేట -17, సిరిసిల్ల -6, సూర్యపేట -28, వికారాబాద్ -23, వనపర్తి -12, వరంగల్ -4, వరంగల్ రూరల్-11, యాదాద్రి భువనగిరి -16)

◆ ఆంధ్రప్రదేశ్ :: 620 

(శ్రీకాకళం- 33, విజయనగరం- 29, విశాఖపట్నం- 44, తూర్పుగోదావరి- 62, పశ్చిమ గోదావరి- 75, కృష్ణా- 53, గుంటూరు- 75, ప్రకాశం- 47, నెల్లూరు- 37, చిత్తూరు- 43, కడప- 51, అనంతపూర్- 28, కర్నూలు- 43

● నోటిఫికేషన్ విడుదల :: 2020 నవంబర్ 20

● దరఖాస్తు ప్రారంభం :: 2020 నవంబర్ 20

● దరఖాస్తుకు చివరి తేదీ :: 2020 డిసెంబర్ 10

● దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ ::

2020 డిసెంబర్ 10

● ఆన్‌లైన్ ఫీజు పీమెంట్ :: 

2020 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10

● దరఖాస్తు ప్రింట్ కు చివరి తేదీ :: 2020 డిసెంబర్ 25

● విద్యార్హతలు :: 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు.

● వయస్సు :: 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

● దరఖాస్తు ఫీజు :: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

● ఎంపిక విధానం :: రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష.

● స్టైపెండ్ ::

మొదటి ఏడాది నెలకు రూ.15,000. రెండో ఏడాది నెలకు రూ.16,500. మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.

● వెబ్సైట్ ::

https://ibpsonline.ibps.in/sbiappamay20/basic_details.php

● నోటిఫికేషన్ ::  PDF