రాత్రి పూట కూడా పని చేయనున్న తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ (GAD)

తెలంగాణ రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో కీలకమైన సాధారణ పరిపాలన శాఖ (GAD) ఇకపై 24 గంటలు పని చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ డిసెంబర్ 2న ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల అమలు కోసం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాత్రివేళ కూడా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టు జీఏడీ అధికారులతో పని చేయించుకోవడానికి కొత్తగా నైట్‌ షిఫ్టుల విధానాన్ని తీసుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం 8 బ్యాచులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అన్ని పనిదినాల్లో ఈ బృందాలు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ప్రత్యేక షిఫ్టులో పని చేయనున్నాయి.
ఇక సెలవు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు రెండు ప్రత్యేక షిఫ్టుల్లో ఈ బృందాలు పనిచేస్తాయి.

ఈ బృందంలో ప్రతి బ్యాచ్‌ కి ఇద్దరు సెక్షన్ అధికారులు, ఒక సహాయ సెక్షన్ అధికారి, ఒక ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు