తెలంగాణ ICET – 2020 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ICET – 2020 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. 2020 – 2021 MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కొరకు కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. డిసెంబర్ – 6 నుండి ధృవ పత్రాల పరీశీలనకు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

★ మొదటి విడత కౌన్సెలింగ్ ::

● డిసెంబ‌రు 6 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు గాను ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్ చేసుకోవాలి.

● డిసెంబర్ 8 నుంచి 12 వరకు ధృవ పత్రాల పరిశీలన ఉంటుంది.

● డిసెంబర్ 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు.

★ రెండో విడత కౌన్సెలింగ్‌ ::

డిసెంబ‌రు 22 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ఉంటుంది.
22న స్లాట్‌ బుకింగ్‌, 23న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 22 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు వివరించింది.

★ చివరి విడత కౌన్సెలింగ్ ::

26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు ఉంటుంది.

28న స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు విద్యామండలి వివరించింది.