ఇంటర్ అడ్మిషన్ల గడువు డిసెంబర్ 12 కి పెంపు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం చివరి తేది నవంబర్ 30 తో ముగిసిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు గడువు తేదీని మరొక్కసారి డిసెంబర్ 12 వరకు పొడిగించడం జరిగింది. 

ప్రథమ సంవత్సరాలకు అడ్మిషన్లకు గడువును డిసెంబర్ 12 వరకు పెంచుతూ ప్రకటన జారీ చేయడం జరిగింది. దీనితో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, – ఎయిడెడ్, అన్ఎయిడెడ్, కేజీబీవీ, గురుకుల జూనియర్ కళాశాలలో డిసెంబర్ – 12 వరకు ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు

అలాగే 2020 – 2021 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియకు ఇది చివరి అవకాశం అని, కావునా అడ్మిషన్లను పూర్తిగా ఈ గడువలోపల పూర్తి చేసుకోవాలని కమీషనర్ ఉమర్ జలీల్ తెలిపారు.