నోములకు కాంట్రాక్టు అధ్యాపకుల నివాళి.

ప్రస్తుత నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే… ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ 475 అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కొప్పిశెట్టి సురేష్ సంఘం తరఫున నోముల నర్సింహయ్యకు నివాళులు అర్పించారు.

గతంలో కాంట్రాక్టు ఉద్యోగుల అనేక సమస్యలపై పోరాటాలకు మద్దతుగా నిలిచారని, ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నర్సింహాయ్య మృతి పట్ల సంఘం తరపున నివాళులు అర్పించారు.