నిరుద్యోగులకు వరం DEET యాప్

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని నిరుద్యోగుల ఉద్యోగ వేటకు సహయపడేందుకు అద్భుతమైన యాప్ ని ఆవిష్కరించరించింది… ఆ యాప్ పేరే డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్ మరియు వెబ్సైట్.


ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలకు బ్రేక్ వేయడానికి మరియు తెలంగాణలోని యువతీయువకులు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు చక్కని ప్లాట్‌ఫామ్‌ DEET ని తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి కల్పన శాఖ రూపొందించింది.


మొదట డీట్ యాప్‌ / వెబ్సైట్ లో మీ పేరు, విద్యార్హతల వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఉంటే వెంటనే మీకు యాప్ లో చూపించబడతాయి.. లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా డీట్ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్ అప్‌లోడ్ చేస్తే… ఆ ఉద్యోగాలకు మీకు తగిన అర్హతలు ఉన్నట్టైతే మీకు మెసేజ్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆల్గరిథమ్స్ ద్వారా మీ అర్హతలకు తగ్గ ఉద్యోగాలను డీట్ యాప్ సూచిస్తుంది. నిరుద్యోగులు మాత్రమే కాదు… ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్ ద్వారా ఈ సేవలన్నింటినీ ఉచితంగానే అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కంపెనీలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్లను ఉచితంగానే నమోదు చేయొచ్చు.


DEET యాప్ నిర్వాహకులు ఆ నోటిఫికేషన్ నిజమైనదేనా? సదరు కంపెనీ నిజంగానే ఉద్యోగాలను ఇస్తోందా? అసలు కంపెనీ ఏంటీ? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? అని పరిశీలిస్తారు. మూడు అంచెల్లో పరిశీలన జరిపిన తర్వాతే యాప్‌లో జాబ్ నోటిఫికేషన్స్ అప్‌లోడ్ అవుతాయి. డీట్ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఇప్పటికే జీఎంఆర్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, స్విగ్గీ లాంటి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటికే డీట్ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని వేల ఉద్యోగాలకు ప్రకటనలున్నాయి.

● వెబ్సైట్ :: https://www.tsdeet.com/

● అప్లికేషన్ లింక్ ::
https://play.google.com/store/apps/details?id=com.tsdeet