INSPIRE – MANAK అవార్డుల ఎంపిక షెడ్యూల్ విడుదల..

దేశ వ్యాప్తంగా ఉన్న 6 -10 వ తరగతి చదువుతున్న విద్యార్ధుల సృజనాత్మతో ఒక మిలియన్ నూతన ఆవిష్కరణలను, నూతన ఆలోచనలను వెలికి తీయడానికి భారత ప్రభుత్వానికి చెందిన శాస్త్ర సాంకేతిక విభాగం వారు నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ (NIF) సహయంతో ప్రతి ఏడాది ఇస్తున్న INSPIRE – MANAK అవార్డ్ ల కోసం జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో (DLEPC & SLEPC) విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శన / ప్రాజెక్ట్ లను ఈ సంవత్సరం (2019 – 20 )కి గాను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేయనున్నారు…

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం తరపున SCERT వారు రాష్ట్రంలో ని పాఠశాల విద్యార్థుల నుండి ప్రదర్శనలు మరియు ప్రాజెక్టులను ఆహ్వనిస్తుంది.

దీనికి సంబంధించిన షెడ్యూల్ మరియు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.

◆ షెడ్యుల్ ::

● డిసెంబర్ 4 నుండి 13 వ తేదీ వరకు జిల్లా (DLEPC) స్థాయిలో ప్రాజెక్టు లను INSPIRE MANAK అప్లికేషన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

● డిసెంబర్ 14 నుంచి 18 మద్యలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన మరియు ప్రాజెక్టులను ఎంపిక చేసి 19 వ తేదీ న రాష్ట్ర (SLEPC) స్థాయికి సబ్మిట్ చేయాలి.

● రాష్ట్ర స్థాయి కి వచ్చిన ప్రదర్శన/ప్రాజెక్టు లను డిసెంబర్ 21 నుంచి 27 మద్యలో INSPIRE MANAK అప్లికేషన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

● డిసెంబర్ 28 – 30 మద్యలో వీటిలో ఉత్తమ ప్రదర్శన/ప్రాజెక్టు లను ఎంపిక చేస్తారు.

◆ మార్గదర్శకాలు ::

● టీచర్లు మరియు పాఠశాల స్థాయిలో ఎంపిక కాబడిన విద్యార్థులను ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా మరియు వెబినార్ ల ద్వారా సమాచారాన్ని, మార్గదర్శకాలను అందించాలి.

● INSPIRE MANAK APP. లో ప్రదర్శన/ ప్రాజెక్టులను అప్లోడ్ చేయించాలి.

● జిల్లా స్థాయిలో జ్యూరీ మెంబర్లను ఎంపిక చేసి ఉత్తమ ప్రదర్శన/ ప్రాజెక్టులను ఎంపిక చేయించాలి.

● ప్రదర్శన/ ప్రాజెక్టు చేసిన విద్యార్థులకు హెచ్.ఎం. లు బోనాపైడ్ సర్టిఫికెట్ మరియు విద్యార్థి పాస్పోర్ట్ పోటోలను APP. లో అప్లోడ్ చేయాలి.

కావునా జిల్లా విద్యాధికారులు పైన చెప్పబడిన కార్యక్రమాన్ని డిసెంబర్18 లోగా జిల్లా(DLEPC) స్థాయిలో పూర్తి చేయాలని సూచించారు.

● వెబ్సైట్ ::

http://www.inspireawards-dst.gov.in/UserP/award.asp