తెలంగాణ లోని కాకతీయ యూనివర్సిటీ పరధిలోని ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం తరగతులు డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ తాడిశెట్టి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో తరగతుల షెడ్యూల్ను నిర్ణయించారు.