కేసీఆర్ చిత్ర పటానికి కాంట్రాక్టు అధ్యాపకుల పాలాభిషేకం.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 13 సంవత్సరాలుగా బదిలీలు లేక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు బదిలీలు జరపాలని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో 508 అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. 

కాంట్రాక్ట్ అధ్యాపకులు సొంత ఇంటికి వందల కిలోమీటర్ల దూరంగా గత 13 సంవత్సరాలకు పైగా  పడుతున్న అవస్థలు, కష్టాలను  ముఖ్యమంత్రి  గుర్తించి పెద్ద మనసుతో  బదిలీలకు సానుకూలంగా స్పందించారని దానికి కృతజ్ఞతాభావంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని  508 అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు చేరల.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఇతర కమిటీ సభ్యులు అయినా వినోద్, దినేష్ రెడ్డి, తిరుపతి,  సాంబరాజు  మరియు అధ్యాపకులు శ్రీనివాసరావు, శ్రీలత, సుజాత  పాల్గొనడం జరిగింది,