ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వోకేషనల్ విభాగంలో పనిచేస్తున్న MTS/హవర్లీ బెసిస్ లెక్చరర్లను 2020 – 21 విద్యా సంవత్సరానికి గాను పదిరోజుల బ్రేక్ తో కొనసాగించవలసిందిగా పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో మినిమం టైం స్కేల్ /హవర్లీ బెసిస్ జూనియర్ లెక్చరర్స్, సీనియర్ ఇన్ స్ర్ర్టకర్ కంప్యూటర్ టెక్నీషియన్స్ టైప్ రైటింగ్ ఇన్ స్ర్ర్టకర్, ల్యాబ్ అటెండర్స్, టైప్ రైటింగ్ టెక్నీషియన్స్ మరియు ఇతర సిబ్బందిని ఈ విద్యా సంవత్సరానికి పది రోజుల బ్రేక్ తో కొనసాగించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు.