విజయవాడ (జూలై – 16) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 2, 000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి (2000 assistant professor jobs recruitment in telangana) ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తో ఒప్పందం చేసుకున్నాయి.
స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించి విధివిధానాలను విశ్వవిద్యాలయాలు, ఏపీపీఎస్సీ కలిసి రూపొందించాయి. రిజర్వేషన్లు, రాత పరీక్ష, వెయిటేజ్, ఇంటర్వ్యూ తదితర అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
స్క్రీనింగ్ రాత పరీక్షలో ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించారు
గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ మార్కులకు వెయిటేజ్ ఉంటుంది. పిహెచ్డి, నెట్, స్లెట్ లకు అదనపు వెయిటేజ్ ఇవ్వనున్నారు.
అకడమిక్ కు 80, పరిశోధనకు 10, బోధన అనుభవానికి 10 శాతం చొప్పున మార్కుల వెయిటేజ్ ఇవ్వనున్నారు.
అకాడమిక్ మార్కుల వెయిటేజ్, మరియు స్క్రీనింగ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేయనున్నారు.
ఇంటర్వ్యూను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పోస్టుకు నలుగురి చొప్పున ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీకి యూనివర్సిటీని యూనిట్ గా తీసుకోవడంతో రిజర్వేషన్లు మొదటి నుండి ప్రారంభం కానున్నాయి.
త్వరలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.