హైదరాబాద్ (డిసెంబర్ – 30) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో ప్రస్తుతం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో వైద్య శాఖలో పనిచేస్తున్న వారికి 20% వెయిటేజ్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
★ వెయిటేజ్ నియమావళి :
◆ రాత పరీక్ష 80 మార్కులకు గాను… 20 మార్కులు వెయిటేజ్ రూపంలో వీరికి కేటాయించింది.
◆ రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్< సంస్థలు, వైద్యపరమైన కార్యక్రమాల్లో నియమితులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 20% వెయిటేజ్ కు అర్హులు.
◆ కనీసం ఆరు నెలలు పనిచేసిన వారికి మాత్రమే ఈ వెయిటేజ్ ను ఇవ్వనున్నారు.
◆ ప్రతి ఆరు నెలలకు 2 పాయింట్లు చొప్పున గరిష్టంగా 20 పాయింట్లు కేటాయించనున్నారు.
◆ ట్రైబల్ ఏరియాల్లో పనిచేసిన వారికి ఆరు నెలలకు 2.5 పాయింట్లు కేటాయించారు.
◆ అంటే ఐదు సంవత్సరాలు సర్వీస్ ఆ పైబడి సర్వీస్ ఉన్నవారికి పూర్తిగా 20 పాయింట్లు వెయిటేజ్ ఇవ్వనున్నారు.
◆ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ముందుగా తమ సర్వీస్ సర్టిఫికెట్లను తీసుకొని తర్వాతనే ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
◆ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన తేదీని సర్వీస్ కు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
◆ సర్వీస్ సర్టిఫికెట్ ను కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి