హైదరాబాద్ (మార్చి – 01) : అగ్నివీరుల భర్తీ విధానం 2023-24 నుంచి పూర్తిగా కొత్త విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. గతంలో అభ్యర్ధుల శారీరక, వైద్య పరీక్షల అనంతరం రాత పరీక్షలను నిర్వహించి సైన్యంలోకి తీసుకునేవారు.. ఇకపై తొలుత ఆన్లైన్లో సాధారణ ప్రవేశ పరీక్షల(సీఈఈ)ను నిర్వహించి.. ఎంపికయ్యే అభ్య ర్ధులకు శారీరక, వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. అనంతరం ఆర్మీలో భర్తీ చేసుకోనున్నారు.
సైన్యంలో సాంకేతిక విభాగాల్లో సిబ్బంది సంఖ్యను పెంచేందుకు అనువుగా ఇకపై ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్ధులకు నియామకంలో బోనస్ గా 20 నుంచి 50 మార్కులను ఇవ్వాలని ఆర్మీ నిర్ణయించింది.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ఆన్లైన్ పరీక్షలకు అవకాశం కల్పించామని రిక్రూటింగ్ డైరెక్టర్ దాస్ తెలిపారు. ఆన్లైన్ పరీక్ష ఫీజు రూ.500లు కాగా.. ఆర్మీ 50శాతం భరిస్తుందని, మిగతాది అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లో మార్చి 15 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని చెప్పారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి వెబ్సైట్లో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామన్నారు. 7996157222 నంబ రుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.