హైదరాబాద్ (జూలై – 20) : ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు, ఎల్లుండి (శుక్ర, శనివారాలు) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం తెలిపారు.
అదే సందర్భంలో ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ను సీఎం ఆదేశించారు.