హైదరాబాద్ (డిసెంబర్ – 02) : తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో 184 వైద్య పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల నియామకాలు డిసెంబర్ 9న వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
అన్ని పోస్టులూ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాకు చెందినవే. వీరిని ఏడాది కాలానికి ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తారు. ఇంటర్వ్యూ కోఠిలోని వైద్యవిద్య సంచాలకుల కార్యాలయంలో వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
ప్రొఫెసర్ కు నెలకు రూ.1.90 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1.50 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 12న వెల్లడిస్తారు. నియమితులైన వైద్యులు నిర్దేశిత ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఈ నెల 19వ తేదీలోపు చేరాల్సి ఉంటుంది.
Follow Us @