- ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం
హైదరాబాద్ (జూన్ – 23) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రతి జిల్లాకు ఒక బీసీ డిగ్రీ గురుకుల కళాశాల ఏర్పాటు చేసినట్టు అయింది.
గత విద్యా సంవత్సరం 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేయగా.. వాటి ద్వారా 15,360 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా ఈ సంవత్సరం ప్రారంభించే డిగ్రీ కాలేజీల్లో 16,320 మందికి అడ్మిషన్లు లభించనున్నాయి.
★ కొత్త గురుకుల డిగ్రీ కాలేజీలు ఇవే :
ఈ ఏడాది ప్రారంభించబోయే బీసీ డిగ్రీ గురుకులాల్ని జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంబీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రారంభించనున్నారు.