తెలంగాణ ఇంజనీరింగ్ విభాగంలో 1,663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ నిరుద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఆర్థిక శాఖ ఈరోజు ఇంజనీరింగ్ విభాగంలో 1,663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇరిగేషన్, ఆర్&బి శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియెరెన్స్ ఇచ్చింది. ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ( అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్) లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ( ఆర్ అండ్ బి, ఎన్. హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ ఆర్ యూబీ ఎస్, హెచ్ వోడీ) లో 284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.

◆ నీటి పారుద‌ల శాఖ

ఏఈఈ పోస్టులు – 704
ఏఈ పోస్టులు – 227
జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు – 212
టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు – 95

◆ ఆర్ అండ్ బీ శాఖ‌

సివిల్ ఏఈ పోస్టులు – 38
సివిల్ ఏఈఈ పోస్టులు – 145
ఎల‌క్ట్రిక‌ల్ ఏఈఈ పోస్టులు – 13
జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు – 60
టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు – 27

◆ భూగ‌ర్భ జ‌ల‌శాఖ

అసిస్టెంట్ కెమిస్ట్ – 4
అసిస్టెంట్ డ్రిల్ల‌ర్ – 4
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 12
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(మెకానిక‌ల్) – 3
అసిస్టెంట్ జియోఫిజిస్ట్ – 6
అసిస్టెంట్ హైడ్రో జియాల‌జిస్ట్ – 15
అసిస్టెంట్ హైడ్రాల‌జిస్ట్ – 5
అసిస్టెంట్ హైడ్రోమెట్రాల‌జిస్ట్ – 1
డ్రిల్లింగ్ సూప‌ర్ వైజ‌ర్ – 4
జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ – 4
ల్యాబ్ అసిస్టెంట్ – 1
టెక్నిక‌ల్ అసిస్టెంట్(హైడ్రోజియాల‌జీ) – 7
టెక్నిక‌ల్ అసిస్టెంట్(హైడ్రాల‌జీ) – 5
టెక్నిక‌ల్ అసిస్టెంట్(జియోఫిజిస్ట్) – 8
ట్రెస‌ర్(డిస్ట్రిక్ట్) – 8
ట్రెస‌ర్(హెచ్‌వోడీ) – 1

Download bikkinews App

Follow Us @