1654 నూతన గెస్ట్ లెక్చరర్ ల నియామకానికి ఉత్తర్వులు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1654 జూనియర్ అధ్యాపక పోస్టులను వెంటనే అందుబాటులో ఉన్న నూతన అభ్యర్థుల చేత “అతిథి” పద్దతిలో అధ్యాపకులను నియమించుకోవాలని ఇంటర్మీడియట్ కమీషనర్ ఒమర్ జలీల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులకు/నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

2021 – 22 విద్యా సంవత్సరంలో మిగిలిన ఐదు నెలల్లో అవసరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను “అతిధి” పద్ధతిలో నియమించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.