1654 నూతన జూనియర్ అతిథి అధ్యాపకుల నియామకానికి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1654 టీచింగ్ పోస్టులలో నూతన అతిధి జూనియర్ అధ్యాపకులను నియమించుకోవడానికి ఉన్నత విద్యాశాఖకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

నూతన జూనియర్ అతిథి అధ్యాపకులను 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే గతంలో హైకోర్టు తీర్పును అనుసరించి వీరి నియామకాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Follow Us @