ASHA WORKER JOBS : 1,540 ఆశా వర్కర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (మార్చి – 21) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 1,540 ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. asha-worker-jobs-in-telangana

హైదరాబాద్ జిల్లాలో 323, మేడ్చల్ జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 పోస్టులు ఉన్నాయి.

తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ.. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.