14,565 నూతన ఇంజనీరింగ్ సీట్లకు అనుమతి

హైదరాబాద్ (జూలై – 06) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 14,565 ఇంజినీరింగ్ సీట్లకు అమోదం తెలుపుతూ ఉత్తర్వులు (14,565 new engineering seats sanctioned in telangana) జారీ చేసింది.

ఇంజినీరింగ్ కాలేజీలు కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దీంతో అదనపు సీట్లతో ఏటా ప్రభుత్వం పై 27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.