BIKKI NEWS (DEC.19) : తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు (14 Thousand Anganwadi Jobs recruitment in telangana) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ. 1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను కేవలం మహిళల చేత భర్తీ చేయనున్నారు.
ఏడవ తరగతి, పదో తరగతి అర్హతతో జిల్లా స్థానికత గల పెళ్లి అయిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.