కరోనా పాజిటివ్ వస్తే 14 రోజుల వేతనంతో కూడిన సెలవు

తెలంగాణ గురుకులం హెడ్ ఆఫీస్, కోఆర్డినేటర్ ఆపీస్ మరియు గురుకుల పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న పనిచేస్త రెగ్యులర్, కాంట్రాక్ట్, పార్ట్ టైం, అవుట్ సోర్సింగ్, సబ్జెక్టు అసోషియోట్స్, గెస్ట్ ఫ్యాకల్టీ ఇతర సిబ్బందికి కోవిడ్ 19 బారిన పడితే 14 రోజుల వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ గురుకుల విద్యా సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా బారిన పడితే వారికి ఉన్న సెలవులను ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

రీజనల్ కో ఆర్డినేటర్స్ మరియు ప్రిన్సిపాల్స్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని పేర్కొనడం జరిగింది.

Follow Us @