- జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ (DMHO) నేరుగా దరఖాస్తు చేయాలి
- దరఖాస్తు చివరి గడువు జనవరి – 07 ; 2023
హైదరాబాద్ (జనవరి – 06) : తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల (హైదరాబాద్ మినహ) హెల్త్ & వెల్‌నెస్ సెంటర్లలో ఖాళీగా ఉన్న 1,365 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ – MLHP – (వైద్యధికారి, స్టాఫ్ నర్స్) ఉద్యోగాలను నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి సంబంధించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖలు నోటిఫికేషన్ లు జారీ చేశాయి. ఈ పోస్టులను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు ఫారాలు సంబంధించిన DMHO లో స్వీకరించి, పూర్తి గా నింపి అక్కడే సమర్పించాలి.
◆ పోస్టుల వివరాలు : వైద్యాధికారులు, స్టాఫ్ నర్స్
◆ మొత్తం పోస్టులు – 1,365
◆ జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య :
1) సిద్దిపేట – 23
2) యాదాద్రి భువనగిరి జిల్లా – 40
3) నాగర్‌కర్నూల్ – 71
4) ములుగు – 30
5) వనపర్తి – 16
6) ఖమ్మం – 70
7) వరంగల్ – 38
8) రంగారెడ్డి – 77
9) నల్గొండ – 104
10) హన్మకొండ – 18
11) మెడ్చల్ – 40
12) మెదక్ – 43
13) కరీంనగర్ – 42
14) జగిత్యాల – 38
15) మంచిర్యాల – 51
16) ఆదిలాబాద్ – 09
17) నిజామాబాద్ – 58
18) నిర్మల్ – 27
19) ఆసిఫాబాద్ – 23
20) పెద్దపల్లి – 39
21) కామారెడ్డి – 28
22) భూపాలపల్లి – 37
23) సంగారెడ్డి – 108
24) మహబూబాబాద్ – 55
25) వికారాబాద్ – 47
26) నారాయణ పేట –
27) జోగులాంబ – 35
28) కొత్తగూడెం – 36
29) సూర్యాపేట – 46
30) జనగాం – 22
31) సిరిసిల్ల – 43
32) మహబూబ్ నగర్ – 57
◆ అర్హతలు : ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ (నర్సింగ్)/జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి.
◆ వయోపరిమితి : 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
◆ వేతనం : నెలకు ఎంవోలకు రూ.40,000; స్టాఫ్ నర్సుకు రూ.29,900.
◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో & ఆన్లైన్ ద్వారా
◆ చిరునామా :
దరఖాస్తులను జిల్లా DMHO అధికారి కార్యాలయంకు వెళ్లి వ్యక్తిగతంగా అందజేయాలి.
◆ దరఖాస్తులకు చివరి తేదీ : 07.01.2023.
◆ ఎంపిక విధానం : అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా
◆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రదర్శన : జనవరి – 10
◆ అభ్యంతరాలు తెలుపుటకు తుది గడువు : జనవరి – 11
◆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రదర్శన : జనవరి – 12
◆ పోస్టింగ్ : జనవరి – 13