13 నూతన పాలిటెక్నిక్ కళాశాలలకు అనుమతి

విజయవాడ (జూలై – 07) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా 13 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనలు ప్రకారం అనుమతులు ఇచ్చింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్య 77,424 కు పెరిగినవి. ఈ సంవత్సరం కొత్తగా 3,180 సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ప్రభుత్వ కళాశాలల్లో 16,494, ఎయిడెడ్ లో 145, ప్రైవేటులో 60,785 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి అదనంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఉంటాయి. కళాశాలల్లో ప్రవేశాలకు త్వరలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.