1,147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (డిసెంబర్ – 06) : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

డిసెంబర్ 20 నుంచి జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెడికల్ విద్య పూర్తి చేసుకున్న 18 నుంచి 44 ఏళ్ల వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అనస్థీషియా, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అనాటమీ లాంటి విభాగాల్లో ఖాళీలున్నాయి.

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm