హైదరాబాద్ (జూలై – 07) : తెలంగాణ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. విద్యార్థులకు ఫలితాలు పట్ల ఏమైనా అనుమానాలు ఉంటే. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ (10th Recounting Re verification) అవకాశాన్ని బోర్డు కల్పించింది.
రీకౌంటింగ్ కోరే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు రూ. 1000 చొప్పున జూలై 10 నుండి 18వ తేదీ వరకు SBI బ్యాంక్ ద్వారా చలాన్లు చెల్లించి దరఖాస్తులను SSC కార్యాలయానికి పంపాలి.