ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల తేదీలు‌.!

హైదరాబాద్ (జూలై – 05) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూలై 10వ తేదీన విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. 4.5 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసి పలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఫలితాలు వస్తేనే డిగ్రీ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది.

◆ పదో తరగతి ఫలితాలు :

తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను జూలై 11వ తేదీ లోపు విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 71,738 మంది విద్యార్థులు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.