గురుకులాల్లో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగుల‌కు తెలంగాణ స‌ర్కారు శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో మ‌రో 10 వేల ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులున్నాయి.

మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా మ‌రో 995 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ల‌భించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ వివిధ శాఖ‌ల్లో ఉన్న‌ 45,325 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది.

Follow Us @