గురుకులాలో 10 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు

తెలంగాణ సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.

రాష్ట్రంలోని 970 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 10 వేల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. కొత్తగా గుర్తించిన పోస్టులతో పాటు గతంలో మంజూరైన వాటి భర్తీకి నూతన జోనల్ విధానం మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపించాయి. ఇవి భర్తీ అయితే.. పోలీశాఖ తరువాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉంటాయని సమా చారం.

రాష్ట్రంలో 970 గురుకుల పాఠశాలలు పనిచేస్తు న్నాయి. వీటిలో మైనార్టీ, బీసీ సొసైటీల పరిధిలో 485 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బీసీ గురుకుల సొసైటు పరిధిలో వివిధ కేటగిరీల్లో 5,387 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 1,250కు పైగా లెక్చరర్ పోస్టులు రానున్నాయి. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీల్లో గతంలో భర్తీ చేయకుండా మిగిలిపోయిన భాషా పండితులు, పీఈటీలు ఇతర కేటగిరీలకు చెందిన 1,200 పోస్టులు ఉన్నాయి. పరిపాలన సంబంధ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా గుర్తించిన బోధన సిబ్బంది పోస్టు లన్నీ కలిపి.. 10 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేనాటికి గురుకులాల్లో దాదాపు7 వేలకు పైగా పోస్టులకు ప్రభుత్వ అనుమతులు మంజూరు చేసింది.

Follow Us @