కేజీబీవీల్లో వెయ్యికి పైగా టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచర్ల కొరత సమస్యను అధిగమించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగా వెయ్యి మంది బోధనా సిబ్బందిని కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఇంటర్వ్యూల ద్వారా టీచర్లను భర్తీచేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉన్నాయి. 172 కేజీబీవీలను
ఇంటర్ వరకు నిర్వహిస్తున్నారు.

Follow Us @