విజయవాడ (డిసెంబర్ -24) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించే పరీక్షలలో ప్రాథమిక ఫలితాలు విడుదల చేసిన తరువాత ప్రాథమిక కీ మీద ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయాలన్న ప్రశ్నకు వంద రూపాయల చొప్పున చెల్లించాలని తాజాగా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
అభ్యర్థుల నుంచి ప్రాథమిక కీ మీద కోకొల్లులుగా వస్తున్న అనవసర అభ్యంతరాలను పరిష్కరించడానికి ఇబ్బందిగా మాట్లాడిన నేపద్యంలో ప్రతి అభ్యంతరానికి 100 రూపాయల చొప్పున ఫీజును నిర్ణయించింది. అభ్యంతరం సరైనది అయితే 100 రూపాయలు తిరిగి చెల్లించనున్నారు. జాతీయస్థాయిలో నిర్వహించే వివిధ పరీక్షల్లో ఈ పద్ధతి ఇప్పటికే అమల్లో ఉంది.