నియామకాలలో కాంట్రాక్టు అధ్యాపకులకు 10 శాతం వెయిటేజి.?

ఉద్యోగుల కేడర్‌ నిర్ధరణ, ఖాళీల గుర్తింపుపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లు, కళాశాల విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు శాశ్వత నియామకాల సందర్భంగా 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని చర్చ వచ్చినట్లు సమాచారం.

శాశ్వత నియామకాలలో మౌఖిక పరీక్షలలో పరిశోధన, బోధనా అనుభవం విభాగంలో వెయిటేజీ ఇవ్వాలని, గతంలో సుప్రీం కోర్టు కూడా ఒక కేసులో తీర్పు ఇచ్చిందని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ప్రస్తావించారు.

ఒప్పంద అధ్యాపకులను పని చేస్తున్న స్థానావను ఖాళీగా చూపొద్దని, వారి పోస్టులను ర్యాటిఫై చేయాలని అధికారులకు సూచించారు.