హైదరాబాద్ (ఫిబ్రవరి – 08) : తెలంగాణ రాష్ట్రంలో 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెస్సు బకాయిల వసూలుపై దృష్టి సారిస్తామని చెప్పారు. శాసనమండలిలో ఫిబ్రవరి 8న సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.
“మన ఊరు-మన బడి కార్యక్రమంలో రూ.7,289.54 కోట్లతో మూడు విడతల్లో 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నాం. తొలి దశలో 9,123 పాఠశాలల్లో జూన్ కల్లా పనులను పూర్తి చేస్తాం. రెండు, మూడు విడతల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణంపై దృష్టి సారిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.
Follow Us @