కాంట్రాక్ట్ /పార్ట్ టైం అధ్యాపకులకు 10% TDS కట్ చేయండి – ఉమర్ జలీల్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు, పార్ట్ టైమ్ జూనియర్ లెక్చరర్ లు, పార్ట్ టైమ్ ల్యాబ్ అసిస్టెంట్ ల వద్ద నుండి ఆదాయపు పన్ను శాఖ 194J రూల్ ప్రకారం సెక్షన్ 121(1) 121(1A) ప్రకారం 10% టీడీఎస్ ను కట్ చేయవలసిందిగా జిల్లా ఇంటర్ విద్యాధికారి/ నోడల్ అధికారులు/ ప్రిన్సిపాల్ లకు ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు.

2020 – 21 సంవత్సరానికి గాను 7.5% TDS ను‌, 2021 మార్చి నుండి 10% TDS ని కట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

గౌరవ వేతనం తీసుకునే వృత్తి నిపుణులు 30 వేల వేతనం దాటితే 10 శాతం టీడిఎస్ కోత విధించాలని 194J ఆదాయపన్ను శాఖ నిబంధనలు తెలుపుతుంది.

https://drive.google.com/file/d/1vJV7cw0EUg2U4tgqg139GsZxGEfAUAct/view?usp=drivesdk

Follow Us @