BIKKI NEWS (NOV. 16) : 10 out of 10 Wickets by Anshul Kamboj. భారత రంజీ ట్రోఫీ చరిత్రలో హర్యానా యువ పేసర్ అన్శుల్ కంబోజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టిన అన్శుల్ ఓవరాల్గా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.
10 out of 10 Wickets by Anshul Kamboj
గ్రూపు-సీలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్ లో అన్శుల్ ఈ ఫీట్ అందుకున్నాడు.
30.1 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన అన్శుల్ 49 పరుగులిచ్చుకుని 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటి వరకు రంజీల్లో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన వారిలో ప్రేమాంగ్శు (బెంగాల్), ప్రదీప్సుదరమ్ (రాజస్థాన్) అన్శుల్ కంటే ముందు ఉన్నారు