Home > SCIENCE AND TECHNOLOGY > MARS – అంగారకుడిపైకి 10 లక్షల మంది – ఎలన్ మస్క్

MARS – అంగారకుడిపైకి 10 లక్షల మంది – ఎలన్ మస్క్

BIKKI NEWS (FEB. 12) : అంగారక గ్రహం (10 LAKHS PEOPLE TO MARS PLANET – ELUN MUSK) పైకి 10 లక్షల మంది ప్రజలను తీసుకెళ్తామని, ఈ మేరక ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ప్రముఖ బిలినియర్ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు.

అంగార కుడిపై నివసించేందుకు చాలా పనిచేయాల్సి ఉందన్నారు. ‘స్టార్ షిప్ అతిపెద్ద రాకెట్ ఇది, ఇది మనల్ని మార్స్ వద్దకు తీసుకెళ్తుంది’ అంటూ ఒక యూజర్ చేసిన పోస్టుకు మస్క్ స్పందించారు. అంగారకుడిపైకి వెళ్లే స్టార్ షిప్ ను ఎప్పుడు ప్రయోగిస్తారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినట్టుగా.. ఒక రోజున మార్స్ కు కూడా ట్రిప్ ఉంటుంది’ అని పేర్కొన్నారు.