CRPF Jobs – 1.30 లక్షల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

న్యూఢిల్లీ (ఎప్రిల్ – 06) : CRPFలో 1.30 లక్షల కానిస్టేబుల్ ఉద్యోగాల (crpf job vacancies ) భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ జనరల్ కేటగిరీలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

పురుషుల కోసం 1.25 లక్షలు, మహిళల కోసం 4667 ఉద్యోగాలు ఉన్నాయి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్లలోపే ఉండాలి. SC, STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్ల అదనపు వయోపరిమితి ఉంది.

అగ్నివీర్ల కు 10% ఉద్యోగాలను కేటాయించగా.. త్వరలో దరఖాస్తుల స్వీకరణ తేదీలు ప్రకటించనున్నారు.