మార్చి 10, 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1. జన్యు మార్పిడి చేసిన పంది గుండె అమర్చిన వ్యక్తి తాజాగా మరణించారు. అతని పేరు.?
జ :- డేవిడ్ బెన్నెట్ (57 సం.)

Q2. ఐసీసీ టెస్ట్ నంబర్ వన్ ఆల్ రౌండర్ ర్యాంక్ దక్కించుకున్న ఆటగాడు.?
జ :- రవీంద్ర జడేజా

Q3. తాజాగా క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్ ఎవరు.?
జ :- శ్రీశాంత్

Q4. 174 ఏళ్ల హైదరాబాద్ పోలీసు చరిత్ర లో శాంతిభద్రతల పోలీసు స్టేషన్ కు తొలిసారిగా భాధ్యత లు చేపట్టిన మహిళ ఇన్స్పెక్టర్ ఎవరు.?
జ:- మధులత (లాలాగూడ స్టేషన్ )

Q5. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ:- గుత్తా సుఖేందర్ రెడ్డి

Q6. తెలంగాణ లో అమలులో ఉన్న చట్టాలపై (287 చట్టాలు, 17 రెగ్యూలషన్స్) 15 సంకలనాలతో కూడిన పుస్తకాలను ఏ శాఖ విడుదల చేసింది.?
జ :- న్యాయ విభాగం

Q7. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాలకు ఆవు పేడతో చేసిన షూట్ కేసుతో అసెంబ్లీ కి వచ్చారు.?
జ :- చత్తీస్ ఘడ్ (భూపేష్ బఘేల్)

Q8. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటును హైదరాబాద్ నుండి ఏ నగరానికి కేంద్రం తరలించింది.?
జ :- జామ్ నగర్ (గుజరాత్)

Q09. రష్యా ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో ఏ అణు విద్యుత్ కేంద్రం తో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తో సంబంధాలు తెగిపోయాయి.?
జ :- చెర్నోబిల్

Q10. రష్యా, రష్యా తో సంబంధం ఉన్న విమానాల పై కఠిన ఆంక్షలు విధించిన దేశం.?
జ :- బ్రిటన్

Q11. మార్చి 9న ‘స్కోచ్‌’ సంస్థ విడుదల చేసిన ‘‘స్కోచ్‌ స్టేట్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ రిపోర్ట్‌ కార్డ్‌ ఫర్‌ 2021’’ నివేదికలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ :- ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ 6వ స్థానం)

Q12. పోల్‌ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు.?
జ :- మోండో డుప్లాంటిస్‌ (6.19 మీటర్లు)

Q13. మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు కేటీఆర్ ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విభాగం పేరు.?
జ :- ఉద్యమిక

Q14. ఇటీవల 2041 క్లైమేట్ ఫోర్స్ అంటార్కిటికా ప్రచారంలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం ఎవరు వహించనున్నారు.?
జ:- ఆరుషి వర్మ

Q15. ఇటీవల భారతదేశం యొక్క ఇరవై మూడవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా ఎవరు మారారు?
జ:- ప్రియాంక నట్కి

Q16. PM-SYM పథకం కింద డొనేషన్ – ఈ – పెన్షన్ కార్యక్రమాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
జ:- కార్మిక మంత్రిత్వ శాఖ

Q17. ఇటీవల గుల్లగూడ మరియు చిట్‌గిద్ద రైల్వే స్టేషన్‌ల మధ్య “కవచ్” మెథడాలజీని ఎవరు పరిశీలించారు?
జ:- అశ్విని వైష్ణవ్

Q18. ఇటీవల ప్రపంచంలోని మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్ ఏజెన్సీ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- టి రాజ కుమార్

Q19. ఇటీవల 2020 మరియు 2021 సంవత్సరానికి గానూ 29 మంది మహిళలకు ‘నారీ శక్తి పురస్కారం’ ఎవరు అందించారు?
జ:- రామ్ నాథ్ కోవింద్

Q20. ఇటీవల ఏ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ మెట్రోను ప్రారంభించారు?
జ:- పూణే

Q21. ఇటీవల ఏ దేశం తన రెండవ సైనిక ఉపగ్రహం నూర్-2ను విజయవంతంగా పరీక్షించింది?
జ:- ఇరాన్

Q22. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ అఖిల భారత కార్యక్రమం “ఝరోఖా”ను నిర్వహించింది?
జ:- సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు జౌళి మంత్రిత్వ శాఖ

Q23. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆమా యోజన’ మరియు ‘బహిని యోజన’లను ప్రారంభించింది?
జ:- సిక్కిం

Q24. జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలుగు అనువాదకుడిగా ఎవరు నియమితులయ్యారు.? జ :- దీకొండ నర్సింగరావు

Q25. మోర్గాన్ & స్టాన్లీ సంస్థ భారత్ లో ద్రవ్యోల్బణం న 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతం పెరగటానికి అవకాశం ఉందని తెలిపింది.?
జ :- 6%

Follow Us @