ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రపంచ ఆహర కార్యక్రమం(WFP) కు దక్కింది. ప్రపంచంలో ఆకలి మీద యుద్ధం ప్రకటించి, శాంతి నేలకొల్పేందుకు చేస్తున్న కృషి కి గాను నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
కరోనా సమయంలో ఏంతో మంది ఆకలి తీర్చి ఆహర భద్రత కల్పించిన సంస్థ WFP, ప్రపంచ వ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు ప్రయత్నించింది. అంతర్ యుద్ధంతో రగులుతున్న ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎంతో దోహదపడినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. యుద్ధ ప్రాంతాల్లో ఆకలిని ఆయుధంగా మార్చుకుని శాంతిని స్థాపించినట్లు కమిటీ చెప్పింది. మానవాళిని పీడిస్తున్న ఆకలి సమస్యను పరిష్కరించేందుకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అతిపెద్ద కార్యక్రమాన్ని చేపట్టినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది. 2019లో 88 దేశాల్లో ఆకలితో అలమటిస్తున్న సుమారు వంద మిలియన్ల మందికి ఆహారాన్ని అందించినట్లు నోబెల్ కమిటీ ప్రశంసించింది.
WFP కి ప్రస్తుతం డేవిడ్ బేస్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.
● విజేత :: world food programme
● కృషి :: ఆకలి మీద యుద్ధం
Follow Us @